ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పట్టణంలో విస్తృతంగా పాదయాత్ర నిర్వహించి, పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఓటర్లను ఆత్మీయంగా కోరారు. ఇంటింటికీ తిరుగుతూ మజ్లిస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీల్లో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.