ఆదిలాబాద్ పట్టణంలోని వసుంధర షాపింగ్ మాల్‌లో గురువారం అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించారు. నిచ్చెన సహాయంతో పైనుంచి లోపలికి ప్రవేశించిన దొంగలు, శుక్రవారం ఉదయం షాపు తెరిచిన యజమాని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, నగదు, సామాగ్రి ఏమీ పోలేదని, దొంగల కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.