ఆదిలాబాద్: జొన్నలు చోరీకి యత్నం.. దాడి

555చూసినవారు
జొన్నల కొనుగోలు కేంద్రంలో దొంగలు చొరబడి రైతులపై దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌లోని జొన్నలను ఎత్తుకుపోవడానికి దొంగలు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై బండలతో దాడి చేశారు. ఇందులో బరంపూర్‌కు చెందిన నారాయణ, రాంపూర్‌కు చెందిన దిలీప్‌కి గాయాలయ్యాయి. మార్కెట్ యార్డులో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్