ఆదిలాబాద్: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

62చూసినవారు
ఆదిలాబాద్: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం
అగ్ని ప్రమాదాల నివారణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ జయంత్ రాం అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌ లోని యాపలగూడ వద్ద గల రెండో బెటాలియన్‌లో సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగితే ఎదుర్కోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అప్రమత్తతోనే ఫైర్ యాక్సిడెంట్‌లను నివారించవచ్చని తెలిపారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించాలన్నారు

సంబంధిత పోస్ట్