ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని, అప్పుడే వ్యాధి బారిన పడకుండా ఉండగలుగుతామని డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్ అన్నారు. ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఐఓ శ్రీనివాస్, ఎన్సీడీ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.