ఆదిలాబాద్: గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలి

5చూసినవారు
ఆదిలాబాద్: గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ రిమ్స్‌లో 'సేఫ్ మదర్‌హుడ్ డే' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ పాల్గొన్నారు. హైరిస్క్ గర్భధారణలను ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణ వైద్యం అందించడం ద్వారా మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండి, గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్