ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్ భరోసా కేంద్రం, షీ టీమ్స్ కార్యాలయాలను పరిశీలించారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. భరోసా కేంద్రం ద్వారా పోలీస్, వైద్య, న్యాయ సేవలు ఒకేచోట అందిస్తూ బాధితులకు రక్షణ, కౌన్సిలింగ్, న్యాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునీల్, ప్రేమ్, సిబ్బంది పాల్గొన్నారు.