ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గ్రామానికి చెందిన మెంగురావ్ (14) అనే బాలుడు జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో మొదట ఉట్నూర్, అనంతరం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.