ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని అను కుంట గ్రామానికి చెందిన సాయికిరణ్ (16) అనే బాలుడు కరీంనగర్ వెళ్లేందుకు బస్సు ఎక్కి అదృశ్యమయ్యాడు. ఈ నెల 28న ఉదయం 8 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కరీంనగర్ బస్సు ఎక్కిన బాలుడు కళాశాలకు చేరుకోలేదు. సాయంత్రం తండ్రికి కళాశాల నుంచి సమాచారం అందడంతో, బుధవారం పలుచోట్ల గాలించిన అనంతరం తండ్రి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.