ఆదిలాబాద్: 12 మంది జూదరులపై కేసు

59చూసినవారు
ఆదిలాబాద్: 12 మంది జూదరులపై కేసు
మావల మండలంలోని వాఘాపూర్ గ్రామ శివారులో ఆదివారం బహిరంగంగా పేకాట ఆడుతున్న 12 మందిని సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 35 వేల నగదుతో పాటు 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని మావల పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు మావల ఎస్సై వంగ విష్ణువర్ధన్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్