బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై శుక్రవారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ మదీనా హోటల్‌లో బాల కార్మికుడితో పని చేయించుకుంటున్న యజమాని అబ్దుల్ హసీబ్‌పై కేసు నమోదు చేసినట్లు టుటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. అదే విధంగా మాంసం దుకాణ యజమాని ప్రవీణ్, మదీనా బెడ్ వర్క్ యజమాని షేక్ ఫరీద్‌పై కార్మిక శాఖ అధికారి శంకర్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ చెప్పారు