ఆదిలాబాద్: నకిలీ సర్టిఫికెట్‌ల తయారీలో ఇద్దరిపై కేసు నమోదు

66చూసినవారు
ఆదిలాబాద్: నకిలీ సర్టిఫికెట్‌ల తయారీలో ఇద్దరిపై కేసు నమోదు
ప్రభుత్వ నకిలీ స్టాంపులతో వివిధ నకిలీ సర్టిఫికెట్‌లను తయారు చేస్తున్న వారిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌కు చెందిన రాహుల్ ఆయన తండ్రి బద్రినాథ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బద్రీనాథ్‌ను అరెస్టు చేశామని, రాహుల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కంప్యూటర్, ప్రింటర్, స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్