మత సామరస్యాన్ని చెడగొట్టేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. వాట్సప్ గ్రూపు అడ్మిన్లు, ఫార్వర్డ్ చేసే వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలన్నారు. చర్చి విషయంలో వీడియోను వైరల్ చేసిన కారణంగా సంతోశ్‌పై టూ టౌన్ లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఇలాంటి వీడియోలను వైరల్ చేసిన వ్యక్తులు, గ్రూపు అడ్మిన్లపై కేసులు పెడతామని హెచ్చరించారు.