ఆదిలాబాద్ భాగ్యనగర్ వార్డులో శనివారం 'పౌర హక్కుల దినోత్సవం' నిర్వహించారు. తహశీల్దార్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శశికాంత్, మల్లేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిమ్న వర్గాల ప్రజలు తమ హక్కులతో పాటు సమస్యల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.