అదిలాబాద్ డీఈవో మాధవి తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ
పరీక్షలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో 96.63 శాతం ఉత్తీర్ణత సాధించగా, 355 మంది
విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వారి కోసమే ఈ
పరీక్షలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని గెజిటెడ్ నంబర్ వన్ పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈవో తెలిపారు.