కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్రమ నోటీసులు ఇస్తున్నారని రామన్న ఆరోపించారు.