ఆదిలాబాద్: సీఎం సభ.. పార్కింగ్ వివరాలు

2చూసినవారు
ఆదిలాబాద్: సీఎం సభ.. పార్కింగ్ వివరాలు
రేపు ఆదిలాబాద్ స్టేడియంలో జరిగే ముఖ్యమంత్రి సభకు హాజరయ్యేవారి కోసం పార్కింగ్ స్థలాలను అధికారులు కేటాయించారు. టూ వీలర్ వాహనాలకు రామ్ లీలా మైదానం, సైన్స్ డిగ్రీ కళాశాల వద్ద, ఆటోలు, కార్లకు డైట్ కళాశాల మైదానంలో, వీఐపీలకు శ్రీ సరస్వతి శిశు మందిర్, టీటీడీ కళ్యాణమండపంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. నిర్మల్ నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు పిట్టలవాడ, మావల పీఎస్ మీదుగా వెళ్లి తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాలలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.