భోరజ్ మండలం రాంపూర్ టి, ఫౌజాపూర్ గ్రామాలలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యు సదస్సులో కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తులను ఆయన పరిశీలించారు. రెవెన్యూ గ్రామసభల ద్వారా ఆర్జీలను స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భోరజ్ పైలెట్ మండలంగా ఎంపికైన నేపథ్యంలో మండలాల్లోని గ్రామాలను రోజువారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు