సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.