ఆదిలాబాద్: బాధితులను పరామర్శించిన కలెక్టర్

72చూసినవారు
ఆదిలాబాద్: బాధితులను పరామర్శించిన కలెక్టర్
ఇటీవల జిల్లాలో పిడుగుపాటుకు గురై గాయాలపాలైన బాధితులను కలెక్టర్ రాజర్షిషా శనివారం పరామర్శించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌లను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అంతకుముందు వారి రిపోర్ట్‌లను కలెక్టర్ పరిశీలించి, వారికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్