వరంగల్లో నిర్వహించిన బీసీ సభలో రెడ్డి కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ రెడ్డి సంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై బుధవారం తీన్మార్ మల్లన్నపై వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు. ఒక రాజ్యాంగ బంధమైనా పదవిలో ఉంటూ, రెడ్డి కులంపై అర్థం పర్థంలేని మాటలతో ప్రజలను పక్క దోవ పట్టిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్న తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు.