ఆదిలాబాద్ డాల్డా కంపెనీ కాలనీలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని కాలనీవాసులు కోరారు. ప్లాట్ నంబర్లు 23, 24 తమవని కొందరు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువచ్చారని, అయితే 1997 నాటి ఆర్డీఓ ఉత్తర్వుల ప్రకారం అధికారులు సర్వే చేసి, ఆ వ్యక్తి భూమి ఎక్కడ ఉందో స్పష్టం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. పేదల భూమిని కాపాడాలని వారు న్యాయం చేయాలని కోరుతున్నారు.