ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూషను కలిసి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. హోటళ్లు, ఇతర దుకాణాల యజమానులు, వినియోగదారులకు ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆమె సూచించారు. దీనికి సభ్యులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు దినేష్ మాటోలియా, ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్ పాల్గొన్నారు.