యువత సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలంటే విద్యతో పాటు నైపుణ్యాలు, సృజనాత్మకత కూడా అత్యవసరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ‘బోస్ ఫెలోషిప్’ సామాజిక సంస్థ భారత్ దేకో ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన, యువత తమ ప్రతిభను ప్రదర్శించి, సామాజిక అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. సమాజంలో స్థిరమైన మార్పు కోసం సమర్థవంతమైన నైపుణ్యాలు కీలకమని ఆయన నొక్కి చెప్పారు.