రాష్ట్ర మంత్రిని కలిసిన ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షుడు

1చూసినవారు
రాష్ట్ర మంత్రిని కలిసిన ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షుడు
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు. ఆదిలాబాద్ జిల్లా సమస్యలు, అభివృద్ధి పనులపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని నరేష్ జాదవ్ మంత్రిని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సంజీవరెడ్డి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :