ఆదిలాబాద్: 'టైగర్ జోన్‌తో అభివృద్ధి ఆగిపోతుంది'

80చూసినవారు
ఆదిలాబాద్: 'టైగర్ జోన్‌తో అభివృద్ధి ఆగిపోతుంది'
ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న టైగర్ జోన్ తో అభివృద్ధి ఆగిపోతుందని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 49తో ఆదివాసి గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ముఖ్యంగా ఆంక్షలను అమలు చేయడంతో ఆదివాసి గిరిజన గ్రామాలకు మౌలిక సౌకర్యాలు కల్పించడం కష్టంగా ఉంటుందని, భారీ వాహనాలు రాక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్