ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, నైవేధ్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ ఎత్తున భక్తులు వస్తారన్న అంచనాలతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దుకాణాల వద్ద మహిళలు సందడి చేశారు.