ఆదిలాబాద్: విద్యుత్ డివిజన్ ఆఫీస్ ఎదుట ధర్నా

2చూసినవారు
ఆదిలాబాద్: విద్యుత్ డివిజన్ ఆఫీస్ ఎదుట ధర్నా
ఆదిలాబాద్ విద్యుత్ డివిజన్ ఆఫీస్ ఎదుట ఆర్టిజన్, అన్ మ్యాన్డ్, బిల్ ఆపరేషన్ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్హతల ప్రకారం ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేయాలని, అన్ మ్యాన్డ్ పీస్ రేటు కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని ఉమ్మడి జిల్లా చైర్మన్ మోసిన్ ఖాన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేత పాండు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్