అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను సోమవారం కలెక్టర్ రాజర్షిషా జండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని ఆయన అన్నారు. పోటీలలో పాల్గొన్న వారిని అభినందించిన కలెక్టర్, వారితో కలిసి క్యారం బోర్డు కూడా ఆడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి కూడా పాల్గొన్నారు.