ఆదిలాబాద్: తిను పదార్థాలలో నిషేధిత రంగులు వాడవద్దు

1చూసినవారు
ఆదిలాబాద్: తిను పదార్థాలలో నిషేధిత రంగులు వాడవద్దు
ఆదిలాబాద్‌లో సురక్షిత ఆహారం, ఆరోగ్యంపై అవగాహన సదస్సులో ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ, తినే పదార్థాలు తయారు చేసే యజమానులు ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత రంగులు వాడకూడదని సూచించారు. వినియోగదారులు వస్తువులను పరిశీలించి కొనాలని తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సంప్రదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ మాటోలియా, ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్