ఆదిలాబాద్ రూరల్ మండలం చందా, రాంపూర్ మధ్య ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ మరో వాహనంను ఢీ కొట్టడం తో డ్రైవర్ కైలాస్ లారీ క్యాబిన్లో ఇరుక్కున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని క్యాబిన్ నుంచి ఆయనను బయటకు తీసి రిమ్స్ ఆస్పత్రికి 108లో తరలించారు. డ్రైవర్ కైలాస్ మహారాష్ట్ర లోని కిన్వట్ తాలూకాకు చెందినవాడు. గాయాలైన ఆయన ప్రస్తుతం రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.