కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జైనథ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ రూప యోగ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి మంగళవారం అభినందనలు తెలిపారు. ప్రశంస పత్రంతో పాటు మెడల్ అందజేసి జాతీయస్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. జైనథ్ ఎస్ఐ పురుషోత్తం, తదితరులున్నారు.