ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భోరజ్ మండలం కామాయి ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పెన్నులు, బుక్కులు, బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం దివ్యాంగురాలికి వీల్ చైర్ అందజేశారు. గ్రామస్థులు ఐక్యతతో ఉండాలని. అందరూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందని సూచించారు.