నార్నూర్ మండలంలో ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటనలో 47 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళ్తే
గుడిహత్నూర్ మండలం సూర్యగుడ గ్రామానికి చెందిన 60 మంది ఆదివాసి ప్రజలు జంగుబాయి దేవస్థానానికి మొక్కులు తీర్చడానికి వెళుతున్నారు. ఈ క్రమంలో నార్నూర్ మండలం మాలెపూర్ ఘాట్ వద్ద ఐచర్ బోల్తా పడింది. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.