ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని హీరాసుక భవనంలో ఆదివాసీ పర్ధన్ సమాజ్ సేవా సంఘ్ డివిజన్ కమిటీ ఎన్నికలను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ మేరకు డివిజన్ కమిటీ అధ్యక్షుడిగా కనక సంతోష్, ప్రధాన కార్యదర్శిగా సోయం రాందాస్, గౌరవ అధ్యక్షుడిగా మాడవి దత్తు, కోశాధికారిగా గజానంద్‌తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. సంఘం బలోపేతానికి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.