ఆదిలాబాద్: ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకోవాలి

71చూసినవారు
ఆదిలాబాద్: ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకోవాలి
మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షం భాగంగా సాత్నాల మండలం జామినిలో అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో వెంకటరాజు పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హెల్ప్ లైన్ నంబర్, పోక్సో యాక్ట్ గురించి మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి తెలియజేశారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ , పంచాయతీ సెక్రెటరీ, సిబ్బంది, ఉన్నారు.

సంబంధిత పోస్ట్