ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ బీ గ్రామంలో సోమవారం రాత్రి అక్రమ సంబంధం నేపథ్యంలో కాంబ్లే చంద్రముని(43) అనే వ్యక్తిని గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన కుటుంబ కలహాలకు దారితీసిందని, భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. చంద్రముని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అభినందన్, సీతావాల్తో పాటు మరికొందరు దాడి చేశారని, తీవ్ర గాయాలతో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్సై విజయ్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.