ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తలమడుగుకు చెందిన రైతు కిషోర్ రావు బుధవారం రుణమాఫీ, రైతుబంధు నిధుల విడుదల కోరుతూ ఆమరణ దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, రబీ రైతుబంధు నిధుల విడుదలలో జాప్యం చేయవద్దని ఆయన డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే రైతులను సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.