ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, పత్తిని 20-25% తేమ శాతంతో కొనుగోలు చేయాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను కోరారు. ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోశెట్టి, దేవిదాస్, రమేష్ కూడా పాల్గొన్నారు.