ఆదిలాబాద్ పట్టణంలో కత్తితో కలకలం సృష్టించిన తండ్రీకొడుకులను టూటౌన్ పోలీసులు మంగళవారం హత్యాయత్నం కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థిరాస్తి భాగస్వామిపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఉమర్ ఖలీల్, వసీం కోక ర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కత్తి, రెండు చరవాణులు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.