ఆదిలాబాద్: భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

75చూసినవారు
ఆశాడ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ ఆలయాల్లో ఆదివారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆదిలాబాద్‌లోని అతి పురాతనమైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం, మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం నుండే భక్తుల తాకిడి కనిపించింది. స్వామివారిని ప్రత్యేక హారతులతో కొలిచిన భక్తులు వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి ఆరాధించారు.