ఆదిలాబాద్ పట్టణంలో ఆదివాసి రాంజీ గోండు భవన నిర్మాణానికి SDF నిధుల కింద రూ. 5 లక్షలు మంజూరవ్వగా, భూమి పూజ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ సోయం బాపూరావు, నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి, తొమ్మిది తెగల ఆదివాసీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ నెల 27న STU భవన్‌లో తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బాపూరావు తెలిపారు.