ఆదిలాబాద్: గద్దర్ సేవలు మరువలేనివి

2చూసినవారు
ఆదిలాబాద్: గద్దర్ సేవలు మరువలేనివి
ప్రజా యుద్ధనౌక గద్దర్ సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ కొనియాడారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గద్దర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తన ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచారని, సమాజంలోని వివక్షపై నిరంతరం పోరాడారని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్