ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్ మండలాల్లో గురువారం అకస్మాత్తుగా కురిసిన భారీ వడగళ్ల వాన జనజీవనాన్ని స్తంభింపజేసింది. నిన్నటి వరకు ఎండవేడి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే, అకస్మాత్తుగా కురిసిన ఈ వడగళ్ల వాన కారణంగా వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.