ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో రంగుల సందడి నెలకొంది. ఉదయం నుంచే యువత కేరింతలు కొడుతూ వీధుల్లో సందడి చేశారు. చిన్నారులు పిచికారీలతో రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. పెద్దలు కూడా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో పట్టణమంతా పండగ కోలాహలంతో కొత్త శోభను సంతరించుకుంది.