ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం హోలీ వేడుకలను బీజేపీ కార్యకర్తలు, పట్టణ ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల జీవితాలన్నీ రంగులమయంగా ఉండాలని, ప్రతీ ఒక్కరిని భగవంతుడు సంతోషంగా ఉంచాలని ఆకాంక్షించారు. హోలీ పాటల మధ్య పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఉత్సాహంగా నృత్యం చేసి అందరినీ అలరించారు. అనంతరం జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.