శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి మాట్లాడుతూ, హిందూ పండుగలు విజ్ఞానపరంగా ఎన్నో లాభాలను చేకూరుస్తాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాల్ కృష్ణ మఠంలో శనివారం జరిగిన సనాతన హిందూ ఉత్సవ సమితి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మార్చి 2న సోమవారం కామదహనం, మరుసటి రోజు మంగళవారం హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజలు సహజసిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.