ఆదిలాబాద్ జిల్లా డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వాహకులకు డీఎంహెచ్‌ఓ రాథోడ్ నరేందర్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. గురువారం జగదాంబ, ఎస్వీ డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేసిన ఆయన, స్కానింగ్‌కు వచ్చిన గర్భిణీల పూర్తి వివరాలు, ప్రసవ అంచనా తేదీలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.