రాష్ట్రంలో గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం జైనథ్ మండలం నిరాల నుంచి బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు ఆదిలాబాద్ 13వ వార్డు, 34వ వార్డు నుంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శ్రీనివాస రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.