మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంత్ చారి ఆత్మ బలిదానాన్ని ప్రజలు ఎన్నటికీ మరువబోరని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంత్ చారి బలిదానంతోనే తెలంగాణ ఉద్యమం మరింత ఉద్ధృతమై రాష్ట్ర సాధన సాధ్యమైందని, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని ఆయన పేర్కొన్నారు.